Mon Dec 23 2024 23:07:44 GMT+0000 (Coordinated Universal Time)
నా మనసు కలచి వేసింది
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో జరిగిన ఘటనపై జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో జరిగిన ఘటనపై జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. మాట మన వ్యక్తిత్వానికి సమానమని, రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సాధారణమని అన్నారు. విమర్శలు ప్రజా సమస్యలపై జరగాలని, వ్యక్తిగత విమర్శలు, దూషణలు ఉండకూడదని జూనియర్ ఎన్టీఆర్ అభిప్రాయపడ్డారు. నిన్న అసెంబ్లీలో జరిగిన ఘటన తన మనసును కలచి వేసిందన్నారు. ప్రజాసమస్యలను పక్కనపెట్టి వ్యక్తి గత దూషణలకు దిగితే అది అరాచక పాలనకు నాంది పలుకుతుందని జూనియర్ అభిప్రాయపడ్డారు.
రాబోయే తరానికి....
ఒక కొడుకుగా, ఒక భర్తగా, ఒక తండ్రిగా మాట్లాడుతున్నానని, ఈ దేశానికి ఒక పౌరుడిగా, తెలుగువాడిగా మాట్లాడాల్సి వచ్చిందని అన్నారు. రాజకీయ నాయకులందరికీ ఒకటే విన్నపమని, దయచేసి ఈ అరాచక సంస్కృతిని ఇక్కడితో ఆపేయాలని, ప్రజా సమస్యలపై పోరాడాలని జూనియర్ ఎన్టీఆర్ కోరారు. రాబోయే తరానికి బంగారు బాట వేసేలా మన నడవడిక ఉండాలని కోరుకున్నారు. ఇది తన విన్నపం మాత్రమేనని, ఇక్కడితో ఆగిపోతుందని కోరుకుంటున్నానని జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు.
Next Story