Mon Dec 23 2024 12:14:33 GMT+0000 (Coordinated Universal Time)
నేడు తారకరత్నకు కీలక పరీక్షలు
సినీ హీరో తారకరత్నకు ఈరోజు మరోసారి కీలక పరీక్షలను నిర్వహించనున్నారు.
సినీ హీరో తారకరత్నకు ఈరోజు మరోసారి కీలక పరీక్షలను నిర్వహించనున్నారు. బెంగళూరులోని నారాయణ హృదయాలయాలో చికిత్స పొందుతున్న తారకరత్న ఆరోగ్యం నిలకడగా కొనసాగుతుందని కుటుంబ సభ్యులు తెలిపారు. చికిత్సకు ఆయన శరీరం స్పందింస్తుందని కూడా తెలిపారు.
స్పెషలిస్టుల సహకారంతో...
అయితే ఈరోజు పరీక్షల తర్వాత కాని తారకరత్న కు అందించే చికిత్సపై మరింత క్లారిటీ వచ్చే అవకాశముందని వైద్య నిపుణులు చెబుతున్నారు. స్పెషలిస్ట్ డాక్టర్లను కూడా ఈరోజు రప్పిస్తున్నారు. తారకరత్న ఆరోగ్యపరిస్థితిపై వారు పూర్తి స్థాయిలో సమీక్షించనున్నారు. ఈరోజు చేసే పరీక్షలు కీలకమని వైద్యులు చెబుతున్నారు. తారకరత్న కోలుకోవాలని నందమూరి అభిమానులు ప్రార్ధిస్తున్నారు.
Next Story