Mon Dec 16 2024 20:55:16 GMT+0000 (Coordinated Universal Time)
Nadendla : రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి నాదెండ్ల
పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ రైతులకు గుడ్ న్యూస్ చెప్పారు
పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ రైతులకు గుడ్ న్యూస్ చెప్పారు. రైతులు ఎక్కడైనా తమ ధాన్యాన్ని విక్రయించుకోవచ్చని తెలిపారు. ఏ మిల్లుకైనా తీసుకుని వెళ్లి అమ్ముకోవచ్చని తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్న నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ రైతులు పండించే ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని తెలిపారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ధాన్యం కొనుగోళ్లలో సంస్కరణలను తీసుకు వచ్చామని చెప్పారు. భారీ వర్షాలు, వరస తుపాన్లు కారణంగా ధాన్యం తడిసిపోకుండా జాగ్రత్త పడటానికి రైతులకు టార్పాలిన్లు ఇస్తున్నామని నాదెండ్ల మనోహర్ తెలిపారు.
టార్పాలిన్లు కూడా ఇచ్చి...
గత ప్రభుత్వం రైతులకు చెల్లించాల్సిన బకాయీలను కూడా తామే చెల్లించామన్న విషయాన్ని నాదెండ్ల గుర్తు చేశారు. దళారుల మాటలను నమ్మి మోసపోవద్దని, తక్కువ ధరకు ధాన్యాన్ని విక్రయించవద్దని, తేమ ఇరవై శాతం వరకూ ఉన్నా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని హామీ ఇచ్చారు. ఒక్కశ్రీకాకుళం జిల్లాలోనే ఈ ఏడాది ఐదు లక్షల టన్నుల ధాన్యాన్ని కొంటున్నట్లు ఆయన తెలిపారు. రైతులు ఇబ్బంది పెట్టే వారిని ఎవరినీ ఉపేక్షించమని, అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. రైతులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ధాన్యాన్ని విక్రయించుకోవాలన్నారు.
Next Story