రిషికొండ బీచ్‌కు ఎంట్రీ ఫీజ్.. మంత్రి క్లారిటీ
విశాఖ రుషికొండ బీచ్‌కు ఎంట్రీ ఫీజ్ వసూలుపై మంత్రి గుడివాడ అమర్నాథ్ క్లారిటీ ఇచ్చారు.
విశాఖపట్నం రుషికొండ బీచ్ కు వెళ్లే సందర్శకులు ఇక నుంచి ఎంట్రీ ఫీజు చెల్లించాల్సి ఉంటుందని గత కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. బీచ్‌లోకి వెళ్లేవారికి ఎంట్రీ ఫీజు రూ. 20గా ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, పదేళ్లలోపు వారికి మాత్రం మినహాయింపు ఉంటుంది. వాహనాల పార్కింగ్ కు కూడా ఫీజు వసూళ్లు చేస్తారని తెలుస్తోంది. ద్విచక్ర వాహనానికి రూ. 10, కారు, జీపులు రూ. 30, బస్సులు రూ. 50 చెల్లించాల్సి చెల్లించాల్సి ఉంటుందని వార్తలు వచ్చాయి. రుషికొండ బీచ్ ను కేంద్ర ప్రభుత్వం బ్లూ ఫ్లాగ్ బీచ్‌గా గుర్తించింది. దీంతో అక్కడ కొన్ని నిబంధనలు అమలు చేయాల్సి ఉంది. పరిశుభ్రమైన తాగు నీరు, టాయిలెట్లు, స్నానాల గదులు, పిల్లలు ఆడుకోవడానికి ఏర్పాట్లు చేశారు. బీచ్‌ను పరిశుభ్రంగా ఉంచేందుకు క్లీనర్లు, సెక్యూరిటీ, లైఫ్ గార్డులు మొత్తం 39 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. వారి జీతాభత్యాలు, ఇతర పనులకు నెలకు రూ.6 లక్షల ఖర్చు అవుతుంది.