Mon Dec 23 2024 03:31:29 GMT+0000 (Coordinated Universal Time)
TDP : కుర్చీలు గాలిలోకి లేచాయి.. తలలు పగిలాయ్...తిరువూరు టీడీపీలో
తిరువూరులో ఇద్దరు తెలుగుదేశం పార్టీ నేతల క్యాడర్ మధ్య ఘర్షణ జరిగింది
తిరువూరులో ఇద్దరు తెలుగుదేశం పార్టీ నేతల క్యాడర్ మధ్య ఘర్షణ జరిగింది. పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని, ఆయన సోదరుడు కేశినేని చిన్ని వర్గాల మధ్య విభేదాలు తారా స్థాయికి చేరుకున్నాయి. తిరువూరులో చంద్రబాబు బహిరంగ సభ ఈ నెల 7వ తేదీన జరగనుంది. సభ ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు ఇద్దరు నేతలు అక్కడకు వెళ్లారు. అయితే అక్కడ టీడీపీ నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలో చిన్ని ఫొటోలు ఉండటం, నాని ఫొటోలు లేకపోవడంతో కేశినేని అనుచరులు ఘర్షణకు దిగారు. సమావేశం జరిగే ప్రాంతంలో వీరంగం సృష్టించారు.
పోలీసు అధికారికి గాయాలు...
కుర్చీలు గాలిలోకి లేచాయి. కొందరికి ఈ సందర్భంగా గాయాల పాలయ్యారు. ఒక పోలీసు అధికారికి కూడా ఈ సందర్భంగా గాయాలయ్యాయని తెలిసింది. రెండు వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఎస్ఐ సతీష్ కు గాయాలు కావడంతో పోలీసులు ఇరువర్గాల కార్యకర్తలపై లాఠీ ఛార్జి చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు భారీగా మొహరించారు. తిరువూరు టీడీపీ కార్యాలయంలో జరగాల్సిన సమావేశం జరిగే పరిస్థితి లేదని తెలుస్తోంది. పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.
Next Story