Fri Dec 20 2024 01:26:52 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీలో టెన్త్ పరీక్ష ఫలితాల విడుదల
ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. మంత్రి బొత్స సత్యనారాయణ ఫలితాలను విడుదల చేశారు
ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. మంత్రి బొత్స సత్యనారాయణ ఫలితాలను విడుదల చేశారు. టెన్త్ ఫలితాల్లో 62.76 శాతం ఉత్తీర్ణత సాధించారు. 78.3 శాతంతో ప్రకాశం జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. 49.7 శాతంతో అనంతపురం జిల్లా ఆఖరి స్థానంలో నిలిచింది.
71 స్కూళ్లలో నిల్...
మొత్తం 4.14 లక్షల విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. 6.22 లక్షల మంది పరీక్షలు రాయగా కేవలం 62.76 శాతం మాత్రమే ఉత్తీర్ణత సాధించింది. ఫలితాల్లో బాలికలే అగ్రస్థానంలో నిలిచారు. ఎక్కువ మంది బాలికలు ఉత్తీర్ణులయ్యారు. 797 పాఠశాలల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించారు. 71 స్కూళ్లలో ఒక్క విద్యార్థి కూడా పాస్ కాకపోవడం విశేషం. బాలికలు 70.70 శాతం, బాలురు 64.02 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు.
Next Story