Mon Dec 23 2024 18:37:55 GMT+0000 (Coordinated Universal Time)
అత్యాచార బాధితురాలికి రూ.10 లక్షలు పరిహారం : సీఎం జగన్
తాజాగా ఈ ఘటనపై సీఎం జగన్ స్పందించారు. ఈ ఘటన జరగడానికి కారణమైన అందరిపై చర్యలు తీసుకోవాలని ..
తాడేపల్లి : విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో మానసిక వికలాంగురాలిపై అత్యాచారం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటన నగరంతో పాటు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది. తాజాగా ఈ ఘటనపై సీఎం జగన్ స్పందించారు. ఈ ఘటన జరగడానికి కారణమైన అందరిపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బాధితురాలి కుటుంబానికి రూ.10 లక్షల పరిహారాన్ని ప్రకటించారు.
కాగా.. ఇప్పటికే ఈ ఘటనలో నిర్లక్ష్యం వహించిన నున్న సీఐ హనీష్, ఎస్సై శ్రీనివాసరావులను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. మూడ్రోజుల క్రితం యువతి ఇంటి నుంచి వెళ్లిపోగా.. తల్లిదండ్రులు ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్ కు వెళ్లినా సరిగ్గా స్పందించలేదని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆ ఇద్దరినీ సస్పెండ్ చేశారు. పోలీసులు పట్టించుకోకపోవడంతో.. తల్లిదండ్రులే ప్రభుత్వాసుపత్రి వద్ద తమ కూతుర్ని గుర్తించినట్లు వార్తలొచ్చాయి.
Next Story