Sun Nov 17 2024 22:44:19 GMT+0000 (Coordinated Universal Time)
నేడు విజయవాడకు సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి నేడు విజయవాడలో పర్యటించనున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి నేడు విజయవాడలో పర్యటించనున్నారు. జగనన్న ఆణిముత్యాలు కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. ఉదయం 10.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి ఏ కన్వెన్షన్ సెంటర్కు చేరుకుని జగనన్న ఆణిముత్యాలు కార్యక్రమంలో పాల్గొని టెన్త్, ఇంటర్ స్టేట్ లెవల్ టాపర్స్ని సత్కరించనున్నారు. అనంతరం మధ్యాహ్నం తాడేపల్లి నివాసానికి చేరుకోనున్నారు.
సోమవారం నాడు తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ఇరిగేషన్ ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అధికారులతో సమీక్ష జరిపారు. ప్రధానంగా సాగు నీటి సరఫరాకు సంబందించిన అంశాల పై జగన్ అధికారులతో చర్చించారు. క్యాలెండర్ ప్రకారం రైతులకు సాగునీరు విడుదల చేస్తున్నామని అధికారులు తెలిపారు. ఇప్పటికే గోదావరి, కృష్ణాడెల్టా, తోటపల్లి కింద ప్రాంతాలకు సాగునీరు విడుదలచేశామని వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం సమీపిస్తున్న కొద్దీ లెఫ్ట్ మెయిన్ కెనాల్ పై కూడా దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఈసీఆర్ఎఫ్ డ్యాం నిర్మాణ ప్రాంతంలో పనులు చురుగ్గా నిర్వహించాలని ఆయన అన్నారు. కేంద్ర జలశక్తి శాఖ, కేంద్ర జలమండలి అధికారులు గైడ్ బండ్లో కుంగిన ప్రాంతాన్ని ఇప్పటికే పరిశీలించటం జరిగిందని అన్నారు. నేల స్వభావంలో మార్పులు కారణంగా ఇది జరిగి ఉండొచ్చని అనుమానాన్ని కమిటీ వెల్లడించిందని, అందుకు సంబంధించిన నివేదికను అధికారులు సీఎం ముందు ఉంచారు. పోలవరం పనులు పూర్తి చేసేందుకు అవసరం అయిన నిధులను కేంద్రం నుండి తెప్పించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇందుకు అవసరం అయిన ప్రతిపాదనలను కేంద్రానికి పంపాలని ఆయన సూచించారు.
మరోవైపు.. కర్నూలు జిల్లా టీడీపీ మాజీ జెడ్పీటీసీ కప్పట్రాళ్ల బొజ్జమ్మ (సుశీలమ్మ) దంపతులు సోమవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సుశీలమ్మ, ఆమె భర్త, దేవనకొండ మాజీ ఎంపీపీ రామచంద్రనాయుడు వైఎస్సార్సీపీ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం, ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి, కడప జెడ్పీ చైర్మన్ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి పాల్గొన్నారు.
Next Story