Mon Dec 23 2024 07:48:55 GMT+0000 (Coordinated Universal Time)
సాయంత్రానికల్లా 3 లక్షలు సాయం చేసిన సీఎం జగన్
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి మంచి మనసు చాటుకున్నారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి మంచి మనసు చాటుకున్నారు. బాధితులు అడిగిన వెంటనే నేనున్నానంటూ సాయం చేశారు. సాయం కోరిన క్యాన్సర్ వ్యాధిగ్రస్తురాలికి సీఎం జగన్ సాయంత్రానికల్లా రూ.3 లక్షలు అందజేశారని తెలిపారు. సీఎం జగన్ మానవతా దృక్పథంతో ఓ క్యాన్సర్ బాధితురాలికి సాయపడ్డారని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.
కన్నూరు సరస్వతి అనే 34 సంవత్సరాల మహిళకు సీఎం జగన్ సాయం అందించారు. విజయనగరం జిల్లా గరివిడి మండలం కొండదాడి గ్రామానికి చెందిన కన్నూరు సరస్వతి తల్లిదండ్రులు ఇద్దరూ క్యాన్సర్ కు బలయ్యారు. సరస్వతికి తోబుట్టువులు కూడా ఎవరూ లేరు.. ఐదేళ్లుగా ఆమె కూడా క్యాన్సర్ తో బాధపడుతోంది. గొంతు క్యాన్సర్ కు గురైన సరస్వతి ప్రస్తుతం వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొందుతోంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి పింఛను పొందేందుకు నిబంధనలు అడ్డువస్తుండడంతో.. చినమేడపల్లిలో గిరిజన వర్సిటీ శంకుస్థాపనకు వచ్చిన సీఎం జగన్ ను కలుసుకుని తన పరిస్థితిని ఆయనకు వివరించింది. సరస్వతి విషాద గాథ విని సీఎం జగన్ అక్కడిక్కడే ఆమెకు రూ.3 లక్షల సాయం ప్రకటించారు. ఆ రూ.3 లక్షల మొత్తాన్ని సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి అందించాలని నిర్ణయించారు. రెవెన్యూ అధికారులు చెక్ ను సిద్ధం చేయగా ఆ చెక్ ను ఆ క్యాన్సర్ బాధితురాలికి అందించామని మంత్రి బొత్స వివరించారు.
Next Story