Mon Dec 23 2024 17:36:08 GMT+0000 (Coordinated Universal Time)
ఉద్యోగుల ఆందోళనపై స్పందించిన జగన్
ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల ఆందోళనపై ముఖ్యమంత్రి జగన్ స్పందించారు. స్పందన వీడియో కాన్ఫరెన్స్ లో జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల ఆందోళనపై ముఖ్యమంత్రి జగన్ స్పందించారు. స్పందన వీడియో కాన్ఫరెన్స్ లో జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. పీఆర్సీ తో సహా ఉద్యోగు కోసం అనేక పథకాలు తీసుకొచ్చామని జగన్ చెప్పారు. కోవిడ్ కారణంగా ఫ్రంట్ లైన్ వారియర్స్ మరణించిన కుటుంబాలకు యుద్ధప్రాతిపదికన ఉద్యోగాలు ఇవ్వాలని జగన్ ఆదేశించారు. కారుణ్య నియామకాలను జూన్ 30వ తేదీ లోగా పూర్తి చేయాలని జగన్ అధికారులను ఆదేశించారు.
కారుణ్య నియామకాల్లో....
కారుణ్య నియామకాల్లో జాప్యం జరుగుతుందని భావిస్తే వారిని గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీ గా ఉన్న పోస్టుల్లో భర్తీ చేయాలని జగన్ ఆదేశించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న వారందరికీ జూన్ 30వ తేదీ నాటికి ప్రొహిబిషన్ పూర్తి చేయాలని జగన్ ఆదేశించారు. జులై 1వ తేదీకి వారికి కొత్త జీతాలు అందాలన్నారు. జగనన్న స్మార్ట్ టౌన్ షిప్ లో ఉద్యోగులకు పదిశాతం రాయితీ ఇస్తామని చెప్పామని, ఉద్యోగులకు మంచి జరగాలనే పదవీ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచామని చెప్పారు. రేపు చలో విజయవాడ కార్యక్రమం ఉన్న సందర్భంగా జగన్ చేసిన ఈ కీలక వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
Next Story