Mon Dec 23 2024 18:27:48 GMT+0000 (Coordinated Universal Time)
బాలినేనికి కీలక పదవి ఇవ్వనున్న సీఎం జగన్ ?
బాలినేనితో మాట్లాడిన సీఎం జగన్.. ఆయనకు కీలక పదవిని కట్టబెట్టనున్నట్లుగా మరో వార్త తెరపైకి వచ్చింది. ఈ నెల 22వ తేదీ..
ఏపీ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో తనకు పదవి రాకపోవడంపై మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అలకబూనిన సంగతి తెలిసిందే. బాలినేనిని బుజ్జగించేందుకు సజ్జల రామకృష్ణారెడ్డి పలుమార్లు ఆయన నివాసానికి వెళ్లారు. ఆఖరికి బాలినేనిని సీఎం జగన్ వద్దకు తీసుకెళ్లారు. నిన్న సీఎంతో గంటన్నరకు పైగా మాట్లాడిన బాలినేని.. తాను సీఎంతోనే ఉంటానని ప్రకటించారు. సీఎం ను కలవక ముందు వరకూ బాలినేని ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారని వార్తలొచ్చాయి. సీఎంతో భేటీ అనంతరం బాలినేని నిర్ణయం మార్చుకున్నట్లుగా తెలుస్తోంది.
బాలినేనితో మాట్లాడిన సీఎం జగన్.. ఆయనకు కీలక పదవిని కట్టబెట్టనున్నట్లుగా మరో వార్త తెరపైకి వచ్చింది. ఈ నెల 22వ తేదీ సీఎం జగన్ ఒంగోలులో పర్యటించనున్నారు. అక్కడ డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ పథకం కింద నగదును విడుదల చేయనున్నారు. అలాగే బాలినేని చొరవతో గుండ్లాపల్లి గ్రోత్ సెంటర్ వద్ద ప్రకాశం జిల్లా ఎన్నారైలు ఏర్పాటు చేస్తున్న ఐటీ కంపెనీని కూడా జగన్ ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఒంగోలు పర్యటనలోనే సీఎం జగన్ బాలినేని పదవికి సంబంధించి కీలక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది.
Next Story