Mon Dec 15 2025 04:02:48 GMT+0000 (Coordinated Universal Time)
ప్రజలకు వినాయకచవితి శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్
వినాయకచవితి సందర్భంగా ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజలకు వినాయకచవితి శుభాకాంక్షలు తెలిపారు.

వినాయకచవితి సందర్భంగా.. నేడు దేశవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. విఘ్నాలు తొలగించే గణేశుడిని ఆరాధిస్తూ నిర్వహించే నవరాత్రోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. భక్తి శ్రద్ధలతో భక్తులు ఏకదంతుడిని కొలుస్తున్నారు. వినాయకుడికి ఇష్టమైన కుడుములు, ఇతర పిండి వంటకాలతో నైవేద్యాలు సిద్ధం చేసి.. పందిళ్లలో పూజలు మొదలుపెడుతున్నారు.
వినాయకచవితి సందర్భంగా ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజలకు వినాయకచవితి శుభాకాంక్షలు తెలిపారు. "విజ్ఞానం, వినయం, సకల శుభాలకు ప్రతీక గణనాథుడు. విఘ్నాలను తొలగించి అభీష్టాలను నెరవేర్చే పూజ్యుడు విఘ్నేశ్వరుడు. ఆయన చల్లని ఆశీస్సులతో ప్రజలందరికీ శాంతి, సౌభాగ్యాలు చేకూరాలని, ప్రతి ఒక్కరికీ మంచి జరగాలని మనసారా కోరుకుంటూ.. మీఅందరికీ వినాయకచవితి శుభాకాంక్షలు" అంటూ ట్విట్టర్ వేదికగా రాష్ట్ర ప్రజలందరికీ వినాయకచవితి శుభాకాంక్షలు తెలిపారు.
Next Story

