Sat Nov 23 2024 05:44:12 GMT+0000 (Coordinated Universal Time)
వారి గురించి ఆరాతీసిన సీఎం జగన్
అమెరికా నుండి భారత విద్యార్థులను వెనక్కు పంపించేసిన సంగతి తెలిసిందే
అమెరికా నుండి భారత విద్యార్థులను వెనక్కు పంపించేసిన సంగతి తెలిసిందే..! వారిలో తెలుగు విద్యార్థులు కూడా ఉన్నారు. వారి గురించి ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆరాతీశారు. అమెరికా నుంచి కొందరు తెలుగు విద్యార్థులను ఇమ్మిగ్రేషన్ అధికారులు వెనక్కి పంపించారు. యూఎస్ యూనివర్శిటీల్లో అడ్మిషన్లు పొంది, వీసాలను తెచ్చుకున్నాక కూడా ఇలాంటివి జరగడం బాధాకరం. సరైన డాక్యుమెంట్లు లేవంటూ, సరైన వివరణ కూడా ఇవ్వకుండానే 21 మంది భారతీయ విద్యార్థులను భారత్ కు డిపోర్ట్ చేశారు.
ఈ ఘటనపై ఏపీ సీఎం జగన్ ఆరా తీశారు. వెనక్కి వచ్చిన విద్యార్థుల వివరాలను తెలుసుకుని వారి సమస్యను పరిష్కరించాలని సీఎం కార్యాలయ అధికారులను ఆదేశించారు. బాధిత విద్యార్థుల పూర్తి సమాచారాన్ని సేకరించాలని చెప్పారు. ఈ అంశంపై పూర్తి స్థాయిలో దృష్టి సారించాలని, అవసరమైతే విదేశీ వ్యవహారాల శాఖతో సంప్రదింపులు జరపాలని సూచించారు
అమెరికాలో ఉన్నత చదువులు చదవాలని వెళ్లిన 21 మంది భారతీయ విద్యార్థులను అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులు వెనక్కి పంపించారు. వీసా ప్రక్రియలను పూర్తి చేసినా.. విశ్వవిద్యాలయాలలో అడ్మిషన్లు తీసుకున్నాక కూడా ఇమ్మిగ్రేషన్ తనిఖీల తర్వాత వెంటనే వెనక్కి పంపారు. అమెరికాలోని అట్లాంట, శాన్ఫ్రాన్సిస్కో, షికాగోలలోని యూనివర్సిటీల్లో చదివేందుకు వెళ్లిన భారతీయ విద్యార్థులను సరైన పత్రాలు లేకపోవడంతో వెనక్కి పంపారు. మెయిల్స్, సోషల్ మీడియా అకౌంట్స్ చూసిన తర్వాత వారిని తిప్పి పంపినట్టుగా చెబుతున్నారు. భారత్కు తిప్పి పంపిన 21 మంది విద్యార్థులు ఐదేళ్లపాటు పాటు అమెరికాలోకి రాకుండా వారిపై ఆంక్షలు విధించినట్టుగా తెలుస్తోంది. అన్ని పత్రాలు సక్రమంగా ఉన్నా తమను ఎందుకు తిప్పిపంపారో అంటూ విద్యార్ధులు ఆవేదన వ్యక్తం చేశారు.
Next Story