Fri Nov 15 2024 23:27:59 GMT+0000 (Coordinated Universal Time)
షిఫ్టింగ్ విషయంలో వెనక్కు తగ్గని సీఎం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి విశాఖపట్నంలో పర్యటించారు. విశాఖపట్నంలోని రుషికొండలో ఐటీ దిగ్గజం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి విశాఖపట్నంలో పర్యటించారు. విశాఖపట్నంలోని రుషికొండలో ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ త్వరలోనే విశాఖ నుంచి పరిపాలన అందించనున్నట్లు స్పష్టం చేశారు. డిసెంబరు నెల లోపు ఈ మార్పు ఉంటుందని ప్రకటించారు. హైదరాబాద్, బెంగళూరు మాదిరిగా వైజాగ్‌లో అపారమైన అవకాశాలు ఉన్నాయని.. వైజాగ్ కూడా ఐటీ హబ్‌గా మారుతుందన్నారు. ఇప్పటికే వైజాగ్ విద్యాసంస్థల కేంద్రంగా మారిందని అన్నారు. ఏటా 15 వేల మంది ఇంజనీర్లు ఇక్కడ తయారవుతున్నారని తెలిపారు. త్వరలోనే విశాఖకు షిఫ్ట్ అవుతున్నాను. పరిపాలన విభాగం అంతా విశాఖకు మారుతుంది. విశాఖ నుంచే పాలన కొనసాగిస్తాం. డిసెంబర్‌లోపు విశాఖకు మారుతాను. విశాఖ నుంచే పాలన కొనసాగిస్తామని తెలిపారు.
వైజాగ్ రాష్ట్రంలోనే అతిపెద్ద నగరమని.. అంతర్జాతీయ విమానాశ్రయం, పొడవైన తీర ప్రాంతం విశాఖ సొంతమని సీఎం జగన్ తెలిపారు. ఇలాంటి సౌకర్యాలన్నీ ఉన్నందునే ప్రముఖ సంస్థలు అనేకం విశాఖలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయన్నారు. కంపెనీలు ఒక్క ఫోన్ కాల్ చేస్తే చాలు.. వారికి కావాల్సిన సదుపాయాలన్నీ కల్పిస్తామని.. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టే కంపెనీలకు కూడా అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారు.
ఏపీ ముఖ్యమంత్రి జగన్ విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో విశాఖకు వెళ్లారు. సీఎంతో పాటు వైవీ సుబ్బారెడ్డి, విడదల రజని ఉన్నారు. ఎయిర్ పోర్టులో జగన్ కు వైసీపీ నేతలు గుడివాడ అమర్ నాథ్, కరణం ధర్మశ్రీ, బూడి ముత్యాల నాయుడు, ఎంపీ సత్యవతి, ఎంపీ సత్యనారాయణ తదితరులు స్వాగతం పలికారు. మధురవాడలో ఇన్ఫోసిస్ కార్యాలయాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. ఇన్ఫోసిస్ తో పాటు వివిధ ఐటీ కంపెనీల ప్రతినిధులతో జగన్ కాసేపు సంభాషించారు.
Next Story