Sun Nov 24 2024 10:36:29 GMT+0000 (Coordinated Universal Time)
విదేశీ విద్య పేద విద్యార్థుల కలగా మిగిలిపోకూడదు : సీఎం జగన్
విదేశీ విద్యకు మంచి కాలేజీల్లో సీట్లొచ్చినా.. డబ్బు కట్టలేని పరిస్థితుల్లో ఉన్న రాష్ట్ర విద్యార్థులకు విదేశాల్లో విద్య ఒక
జగనన్న విదేశీ విద్యాదీవెన పథకం..
357 ఖాతాల్లోకి రూ.45.53 కోట్లు జమ
6 నెలల్లో జగనన్న విదేశీ విద్యాదీవెన కింద రూ. 65.48 కోట్లు విడుదల
విదేశీ విద్య పేద విద్యార్థుల కలగా మిగిలిపోకూడదన్న లక్ష్యంతో.. ప్రపంచంలోని అగ్రశ్రేణి యూనివర్శిటీల్లో పేదలు కూడా ఉన్నత విద్యను అభ్యసించేలా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జగనన్న విదేశీ విద్యాదీవెన పథకానికి శ్రీకారం చుట్టారు. గురువారం మంగళగిరి క్యాంపు కార్యాలయం నుంచి బటన్ నొక్కి 357 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నేరుగా రూ.45.53 కోట్ల నగదును జమ చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. విద్యావ్యవస్థలో ఇదొక విప్లవాత్మక మార్పు అని పేర్కొన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ విద్యావ్యవస్థలో ఇలాంటి మార్పులు లేవన్న ఆయన.. రాజకీయాలకు అతీతంగా విద్యార్థులకు అండగా నిలబడుతున్నామన్నారు.
విదేశీ విద్యకు మంచి కాలేజీల్లో సీట్లొచ్చినా.. డబ్బు కట్టలేని పరిస్థితుల్లో ఉన్న రాష్ట్ర విద్యార్థులకు విదేశాల్లో విద్య ఒక వరంలా ఉండాలన్న ఉద్దేశంతో జగనన్న విదేశీ విద్యాదీవెన పథకాన్ని అమలు చేస్తు్న్నామని తెలిపారు. జగనన్న విదేశీ విద్యాదీవెన పథకాన్ని అత్యంత పారదర్శకంగా.. అవినీతికి, వివక్షకు తావులేకుండా అమలు చేస్తున్నామని సీఎం పేర్కొన్నారు. ఫీజుల కోసం తల్లిదండ్రులు అప్పులు చేసే పరిస్థితి ఉండకూడదనే ప్రభుత్వం విద్యార్థుల చదువుకు అండగా నిలుస్తుందన్నారు.
క్యూస్, టైమ్స్ ర్యాంకింగ్స్లో 21 కోర్సుల్లో టాప్ సుమారు 350 కాలేజీల్లో సీటు వచ్చిన విద్యార్థులకు చేయూతనందిస్తున్నట్లు సీఎం వివరించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రూ.1.25 కోట్లు, మిగిలిన వారికి కోటి రూపాయల వరకూ జగనన్న విదేశీవిద్య ద్వారా ఫీజులు, విమాన, వీసా ఛార్జీలు కూడా చెల్లిస్తున్నామని చెప్పారు. ప్రపంచ ప్రఖ్యాత కాలేజీల్లో.. మన పిల్లలకు సీటొస్తే ఫీజులుకట్టి చదవడం సాధ్యమేనా అనే ఆలోచన నుండే ఈ పథకం పుట్టిందన్నారు. విదేశీ విద్య అభ్యసించి వస్తేనే.. రేపు మన పిల్లలు ప్రపంచాన్ని శాసించే విధంగా టాప్ సీఈఓలుగా ఉద్యోగాలు చేసే స్థాయి వస్తుందని, అందుకే పేద విద్యార్థులకు అండగా నిలబడుతున్నామన్నారు.
గత ప్రభుత్వం విదేశీ విద్యకై విద్యార్థులకు కేవలం రూ.10 లక్షలే ఇచ్చేవారన్న సీఎం జగన్.. వాటికి కూడా సిఫార్సులు తీసుకునేవారని విమర్శించారు. అది కూడా అరకొరగానే చేసిన గత ప్రభుత్వం రూ.318 కోట్ల బకాయిలు ఉంచిందన్నారు. ఇప్పుడు టాప్ 320 కాలేజీలకు శాచురేషన్ పద్ధతిలో జగనన్న విదేశీవిద్య పథకాన్ని వర్తింపజేస్తున్నట్లు తెలిపారు. ఇమ్మిగ్రేషన్ అనుమతిరాగానే ఒక వాయిదా, మొదటి సెమిస్టర్ పూర్తికాగానే రెండో వాయిదా, రెండో సెమిస్టర్ రాగానే మూడో వాయిదా, 4వ సెమిస్టర్ పూర్తయ్యాక నాలుగో వాయిదా ఇలా నాలుగు వాయిదాల్లో విదేశీ విద్య అభ్యసిస్తున్న పేద విద్యార్థులకు ఫీజులు చెల్లిస్తున్నట్లు తెలిపారు.
Next Story