Sun Nov 17 2024 20:32:17 GMT+0000 (Coordinated Universal Time)
ఆగస్టు 1న విశాఖలో సీఎం జగన్.. విద్యార్థులతో ముఖాముఖి
ఆగస్టు 1న ఉదయం 10.55 గంటలకు ప్రత్యేక విమానంలో వైజాగ్ విమానాశ్రయానికి చేరుకుంటారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విశాఖపట్నం పర్యటనకు వెళ్లనున్నారు. విశాఖపట్నంలో మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటించనున్నారు. నగరంలోని వివిధ అభివృద్ధి పనులకు శంకుస్ధాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. కైలాసపురం పోర్టు ఆసుపత్రి సమీపంలో ఇనార్బిట్ మాల్ నిర్మాణానికి సీఎం భూమి పూజ చేయనున్నారు. జీవీఎంసీకి చెందిన 50 అభివృద్ది పనులకు శంకుస్ధాపన చేయనున్నారు సీఎం జగన్. సిరిపురంలోని ఏయూ క్యాంపస్‌కు చేరుకోనున్నారు. ఎలిమెంట్ ఫార్మా ఇంక్యుబేషన్ సెంటర్, బయో మానిటరింగ్ హబ్‌తో సహా ఐదు ప్రాజెక్టులకు సంబంధించిన భవనాలను సీఎం ప్రారంభించనున్నారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి బీచ్ రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ సెంటర్‌కు రానున్నారు. ఆంధ్ర యూనివర్శిటీ విద్యార్ధులతో సీఎం మాట్లాడనున్నారు.
ఆగస్టు 1న ఉదయం 10.55 గంటలకు ప్రత్యేక విమానంలో వైజాగ్ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి 11.15 గంటలకు కైలాసపురం పోర్టు ఆసుపత్రి వద్దకు చేరుకుంటారు. ఇనార్బిట్ మాల్‌కు శంకుస్థాపన చేస్తారు. మధ్యాహ్నం 12.25 గంటలకు బయలుదేరి సిరిపురం కూడలిలోని ఏయూ ప్రాంగణానికి చేరుకుంటారు. అక్కడ ఎలిమెంట్ ఫార్మా ఇంక్యుబేషన్, బయో మోనిటరింగ్ హబ్‌తో పాటు మరో నాలుగు భవనాలను ప్రారంభిస్తారు. 12.50 గంటలకు ఏయూ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 1 గంటకు బీచ్‌రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ సెంటర్‌కు వెళ్లనున్నారు. ఆయా కార్యక్రమాలు ముగిసిన తర్వాత 1.20 గంటలకు కన్వెన్షన్ సెంటర్ నుంచి బయలుదేరి 1.40 గంటలకు విమానాశ్రయానికి చేరుకుంటారు. 1.50 గంటలకు ప్రత్యేక విమానంలో విజయవాడ చేరుకుంటారు.
Next Story