Mon Dec 15 2025 06:26:35 GMT+0000 (Coordinated Universal Time)
రేపు తిరుపతి పర్యటనకు వెళ్లనున్న సీఎం.. షెడ్యూల్ ఇదే !
సీఎం జగన్ తిరుపతి పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. గురువారం ఉదయం 9.30 గంటలకు..

తాడేపల్లి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం శ్రీ బాలాజీ జిల్లా కేంద్రమైన తిరుపతిలో పర్యటించనున్నారు. సీఎం జగన్ తిరుపతి పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. గురువారం ఉదయం 9.30 గంటలకు జగన్ తాడేపల్లి నివాసం నుంచి బయల్దేరి.. 11.05 గంటలకు తిరుపతి ఎస్వీ వెటర్నరీ కాలేజ్ గ్రౌండ్స్‌కు చేరుకుంటారు. 11.20 గంటలకు ఎస్ వీ యూనివర్శిటీ స్టేడియంకు చేరుకుని జగనన్న విద్యాదీవెన కార్యక్రమంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో సంభాషిస్తారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడుతారు.
మధ్యాహ్నం 12.55 గంటలకు టిటిడి నిర్మిస్తున్న శ్రీ పద్మావతి చిల్డ్రన్స్ మల్టీసూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి భవన నిర్మాణానికి భూమిపూజ నిర్వహిస్తారు. చిన్న చిన్న కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం.. టాటా కేన్సర్ కేర్ సెంటర్ (శ్రీ వెంకటేశ్వర ఇన్ట్సిట్యూట్ ఆఫ్ కేన్సర్ కేర్ అండ్ అడ్వాన్స్ రీసెర్చ్ హాస్పిటల్)కు చేరుకుని నూతన ఆసుపత్రిని ప్రారంభిస్తారు. 2.25 గంటలకు రేణిగుంట ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి 3.35 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.
Next Story

