Sat Mar 15 2025 12:42:49 GMT+0000 (Coordinated Universal Time)
మేకపాటి శాఖలను ఇతర మంత్రులకు..?
దివంగత మేకపాటి గౌతమ్ రెడ్డి నిర్వహించిన శాఖలను ఇతర మంత్రులకు కేటాయిస్తూ జగన్ నిర్ణయం తీసుకున్నారు

దివంగత మేకపాటి గౌతమ్ రెడ్డి నిర్వహించిన శాఖలను ఇతర మంత్రులకు కేటాయిస్తూ జగన్ నిర్ణయం తీసుకున్నారు. మంత్రి మేకపాటి గుండెపోటుతో ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే. ఈ నెల 7వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ సమావేశాల్లో మంత్రి మేకపాటి నిర్వహించిన శాఖలకు సంబంధించిన ప్రశ్నలకు జవాబులు ఇచ్చే బాధ్యతను కొందరు మంత్రులకు అప్పగించారు.
నలుగురు మంత్రులకు....
ఐటీ, పరిశ్రమలు, స్కిల్ డెవలెప్మెంట్ శాఖలను మంత్రి సీదిరి అప్పలరాజుకు, లా అండ్ జస్టిస్ శాఖను మంత్రి ఆదిమూలపు సురేష్ కు, జీఏడీ శాఖను మంత్రి కురసాల కన్నబాబుకు, పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్, ఎన్ఆర్ఐ ఎంపవర్మెంట్ శాఖలను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డికి కేటాయించారు. అసెంబ్లీ సమావేశాల్లో ఈ శాఖల వ్యవహారాలను ఈ మంత్రులే చూస్తారు.
Next Story