Mon Dec 23 2024 16:29:51 GMT+0000 (Coordinated Universal Time)
మూడు నెలలు చికెన్ దుకాణాలు బంద్ చేయండి.. చికెన్ తింటే అంతేనట
నెల్లూరు జిల్లాలో చికెన్ దుకాణాలు మూసేయాలని కలెక్టర్ ఉత్తర్వుుల జారీ చేశారు. నెల్లూరు జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలం రేగింది
నెల్లూరు జిల్లాలో చికెన్ దుకాణాలు మూసి వేయాలని కలెక్టర్ ఉత్తర్వుుల జారీ చేశారు. నెల్లూరు జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలం రేగింది. అనేక కోళ్ల ఫారంలో కోళ్లు చనిపోతున్నాయి. వరసగా కోళ్లు చేనిపోతుండటంతో ఫారం యజమానులు ఈ విషయాన్ని పశుసంవర్థక శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. పొదలకూరు, కోవూరు ఈ వ్యాధి సోకి కోళ్లు ఎక్కువగా చనిపోతున్నాయి.
బర్డ్ ఫ్లూగా అనుమానించి...
బర్డ్ ఫ్లూగా అనుమానించి నమూనాలను భోపాల్ ల్యాబ్ కు పంపినట్లు పశుసంవర్థక శాఖ అధికారులు తెలిపారు. బర్డ్ ఫ్లూ వ్యాధి వ్యాపించిందని మూడు నెలల పాటు చికెన్ దుకాణాలు బంద్ చేయాలని అధికారులు ఆదేశించారు. కోళ్ల మృతికి బర్డ్ ఫ్లూ కారణని అధికారులు నిర్ధారించడంతో కోళ్లు మృతి చెందిన ప్రాంతాల్లో వంద మీటర్లలో ఉన్న అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.
Next Story