Mon Dec 23 2024 16:20:01 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీలో కలెక్టర్ల సదస్సు ఎప్పుడంటే?
ఆంధ్రప్రదేశ్ లో త్వరలో కలెక్టర్ల సదస్సు జరగబోతుంది.ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు
ఆంధ్రప్రదేశ్ లో త్వరలో కలెక్టర్ల సదస్సు జరగబోతుంది. శాసనసభ సమావేశాలు ముగిసిన అనంతరం జరిగే కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొంటారు. తొలిసారి జరిగిన కలెక్టర్ల సమావేశంలో చర్చించిన, తీసుకున్న నిర్ణయాలకు తగ్గట్లు పురోగతి వివరించేలా నివేదికలు సిద్ధం చేయాలని కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది.
ప్రభుత్వ ప్రాధాన్యతలను...
ప్రభుత్వ శాఖల వారీగానూ నివేదిక సిద్ధం చేయాలని సూచించింది. ఇప్పటికే ప్రభుత్వ ప్రణాళికలను, ప్రాధాన్యతలను చంద్రబాబు వివరించారు. ఈ మేరకు కలెక్టర్లు పనిచేయాలని గతంలోనే చంద్రబాబు ఆదేశించారు. ఒకరోజంతా కలెక్టర్ల సమావేశం నిర్వహించి వారికి చంద్రబాబు మరొకసారి దిశానిర్దేశం చేసే అవకాశముంది.
Next Story