Mon Dec 23 2024 04:21:51 GMT+0000 (Coordinated Universal Time)
వైసీపీ నేతల వీడియో లీక్.. పార్టీకి డ్యామేజే
గన్నవరం వైసీపీ నేతలు దుట్టారామచంద్రరావు, యార్లగడ్డ వెంకట్రావు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
వైసీపీ నేతల ఆడియో సోషల్ మీడియాలో దుమారం రేపుతుంది. గన్నవరం వైసీపీ నేతలు దుట్టారామచంద్రరావు, యార్లగడ్డ వెంకట్రావు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వైసీపీ హైకమాండ్ కూడా అప్రమత్తమయింది. కొడాలి నాని, వల్లభనేని వంశీలపై చేసిన వ్యాఖ్యలపై వైసీపీ హైకమాండ్ సీరియస్ గా ఉన్నట్లు సమాచారం. ఒక ప్రయివేటు కార్యక్రమంలో యార్లగడ్డ వెంకట్రావు, దుట్టా రామచంద్రరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారి మధ్య జరిగిన సంభాషణ పార్టీని ఇబ్బంది పెట్టేలాగా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది.
నాని, వంశీపై...
కొడాలి నాని ఏడో తరగతి తప్పారని, ఏ సినిమాలోనైనా హీరో కంటే విలన్ కే ఎక్కువ క్రేజ్ ఉంటుందని వారన్నారు. నియోజకవర్గానికి వీరు ఎందుకైనా ఉపయోగపడతారా? అని ప్రశ్నించారు. వల్లభనేని వంశీ, కొడాలి నానికి అన్ని ఆస్తులు ఎలా వచ్చాయని? ఏ వ్యాపారం చేసి ఇంత డబ్బు సంపాదించారని వారు ప్రశ్నించారు. వల్లభనేని వంశీ ఆగడాలను ప్రశ్నించబట్టే తమకు ప్రజల్లో గుర్తింపు వచ్చిందని దుట్టా రామచంద్రరావు వ్యాఖ్యానించారు. మీడియాను మేనేజ్ చేయడంటో వల్లభనేని వంశీ దిట్ట అంటూ యార్లగడ్డ వెంకట్రావు కామెంట్ చేశారు.
Next Story