Mon Dec 23 2024 18:38:08 GMT+0000 (Coordinated Universal Time)
నేడు మరోసారి చర్చలు
నేడు ఉద్యోగ సంఘాలతో మంత్రుల కమిటీ భేటీ కానుంది. ఇప్పటికే ఉద్యోగ సంఘాలకు చర్చలకు రావాల్సిందిగా ఆహ్వానం అందింది.
నేడు ఉద్యోగ సంఘాలతో మంత్రుల కమిటీ భేటీ కానుంది. ఇప్పటికే ఉద్యోగ సంఘాలకు చర్చలకు రావాల్సిందిగా ఆహ్వానం అందింది. అయితే పీఆర్సీ జీవో రద్దు, అశుతోష్ కమిటి నివేదిక బయటపెడితేనే తాము చర్చలకు వస్తామని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు. కాని చర్చల్లో వాటిని పరిష్కరించుకుందామని మంత్రుల కమిటీ చెబుతుంది.
తమ డిమాండ్లను....
మొన్న మంత్రుల కమిటీ స్టీరింగ్ కమిటీ సభ్యులు కొందరు వెళ్లి వినతి పత్రాన్ని ఇచ్చారు. దానిపై ప్రభుత్వం నుంచి స్పందన రాలేదు. రాకపోగా కొత్త జీతాల చెల్లింపునకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు వెళ్లడంతో ఉద్యోగసంఘాల్లో మరింత ఆగ్రహం వ్యక్తమవుతుంది. దీంతో ఈరోజు మంత్రుల కమిటీ సమావేశానికి ఉద్యోగ సంఘాల నేతలు హాజరవుతారా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది.
Next Story