Mon Dec 23 2024 13:29:27 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : నేడు మహారాష్ట్రకు చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు పూర్తయిన నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నేడు మహారాష్ట్రకు వెళుతున్నారు
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు పూర్తయిన నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నేడు మహారాష్ట్రకు వెళుతున్నారు. ఆయన కొల్హాపూర్ లోని శ్రీ మహాలక్ష్మీ ఆలయాన్ని సందర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం మధ్యాహ్నం షిర్డికి చేరుకుంటారు. షిర్డీలో సాయిబాబా దేవాలయాన్ని ఆయన దర్శిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.
ఎన్నికలు పూర్తయిన తర్వాత...
ఎన్నికలు పూర్తయిన తర్వాత ఆయన వరసగా ఆధ్యాత్మిక క్షేత్రాలను సందర్శిస్తున్నారు. ఇటీవల మోదీ నామినేషన్ వేయడానికి వారణాసికి వెళ్లిన చంద్రబాబు నేడు మహారాష్ట్ర వెళ్లనున్నారు. ప్రచారాన్ని ముగించిన సమయంలోనూ చంద్రబాబు చివరి రోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సంగతి తెలిసిందే.
Next Story