Mon Dec 23 2024 02:46:51 GMT+0000 (Coordinated Universal Time)
Ys Sharmila : జగన్ కు వైఎస్ షర్మిల బహిరంగ లేఖ
కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు
ధరలు, ఛార్జీలు పెరుగుదలపై కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిలముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. ధరలు పెరుగుదలతో ప్రజలపై పడిన ఆర్థిక భారాన్ని తగ్గించే ఉపశమన చర్యలు ఏం తీసుకున్నారని ప్రశ్నించారు. ఐదేళ్ల లో ఒక్కటి తీసుకోలేదు ఎందుకని అడిగారు. రైతులకు గిట్టుబాటు ధర తో సంబంధం లేకుండా 3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి అని చెప్పి ఎందుకు అమలు చేయలేదన్నారు. విద్యుత్ చార్జీలు పెంచము అని వాగ్ధానం చేసి.. ప్రజల మీద 13 వందల కోట్ల భారాన్ని ఎందుకు మోపారని షర్మిల నిలదీశారు. పెట్రోల్,డీజిల్ మీద 500 కోట్లు, ఆర్టీసీ చార్జీల ద్వారా 700 కోట్లు, మద్యంపై 18 వందల కోట్ల మేర ధరలు పెంచి ప్రజలపై భారాన్ని ఎందుకు మోపారన్నారు.
వీటికి సమాధానం ఏదీ?
పెట్రోల్,డీజిల్ ధరలు పెరిగినప్పుడు రాష్ట్ర ప్రభుత్వ పన్నుల కింద తగ్గించే అవకాశం ఉన్నా..ఆ దిశగా ఎందుకు ప్రయత్నాలు చేయలేదన్నారు. యూనివర్సిటీ లో ప్రమాణాలు పెంచకుండా విద్యార్థుల ఫీజులను 2850 కి ఎందుకు పెంచారని నిలదీశారు. ఇసుక ధరలను 5 రెట్లు పెంచి నిర్మాణ రంగాన్ని దెబ్బతీసి, 40 లక్షల మంది కార్మికుల జీవనోపాధి పై ఎందుకు దెబ్బ కొట్టారని వైఎస్ షర్మిల ప్రశ్నించారు. ఈ ఏడాదిలోనే 10 వేల కోట్ల రూపాయల మేర పన్నులు పెంచారని, అదే స్థాయిలో 47 వేల కోట్ల అప్పులు తెచ్చారని, అయినా అభివృద్ధి శూన్యంమని అన్నారు.
Next Story