Fri Nov 22 2024 09:37:40 GMT+0000 (Coordinated Universal Time)
అచ్చెన్నాయుడిపై ఫైర్ అయిన వైఎస్ షర్మిల
ఆంధ్రప్రదేశ్ లో విత్తనాల కొరతతో రైతులు ఇబ్బంది పడుతున్నారని కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు.
ఆంధ్రప్రదేశ్ లో విత్తనాల కొరతతో రైతులు ఇబ్బంది పడుతున్నారని కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. రైతులకు సకాలంలో విత్తనాలు పంపిణీ చేయకుండా ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని అన్నారు విత్తనాల కొరతపై వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు ఇచ్చిన వివరణ తలా తోక లేనిదన్నారు. సాగర్ కుడికాలువ కింద రైతులకు విత్తన కొరత లేదని గుండె మీద చెయ్యి వేసుకొని చెప్పగలరా ? అని వైఎస్ షర్మిల ప్రశ్నించారు.. పల్నాడు జిల్లాలో కౌంటర్ల దగ్గర రైతుల పడుతున్న కష్టాలు మీకు కనిపించడం లేదా ? అని వైఎస్ షర్మిల నిలదీశారు.
క్యూలైన్ లో నిలబడి...
సంబంధిత శాఖ మంత్రిగా నేరుగా పరిస్థితి చూసే మాట్లాడుతున్నారా ?రాత్రంతా క్యూలైన్లో రైతులను నిలబెట్టడమా మీ ఎన్డీఏ ప్రభుత్వం ఉద్దేశ్యమని ఆమె అడిగారు. సంక్షోభం నుంచి సంక్షేమం అంటే కుండపోత వర్షంలో మహిళలను ఇబ్బందులు పాలు చేయడమే కాబోలు అంటూ ఎద్దేవా చేశారు. రైతుల గురించి ప్రశ్నిస్తే సమాధానం చెప్పే దమ్ము లేక కుటుంబాన్ని బయలకు లాగుతున్నారన్నారని వైఎస్ షర్మిల అన్నారు. వైసీపీ ప్రభుత్వానికి రైతు సంక్షేమం పట్టకనే కదా… మీకు పట్టం కట్టిందని అన్న వైఎస్ షర్మిల జగన్ నిండా ముంచారు అనే కదా 11 సీట్లకు పరిమితం చేసిందని ధ్వజమెత్తారు.
Next Story