Thu Jan 09 2025 05:02:51 GMT+0000 (Coordinated Universal Time)
Ys Sharmila : కూటమి సర్కార్ పై షర్మిల ఫైర్... మోదీతో ఆ మాట చెప్పించండి
చంద్రబాబు మోడీ కోసం ఎదురు చూస్తుంటే ఇచ్చిన వాగ్దానాల కోసం రాష్ట్రం ఎదురు చూస్తోందని కాంగ్రెస్ చీఫ్ షర్మిల అన్నారు.
చంద్రబాబు మోడీ కోసం ఎదురు చూస్తుంటే ఆయన ఇచ్చిన వాగ్దానాల కోసం రాష్ట్రం ఎదురు చూస్తోందని కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. విభజన హామీలపై చేసిన మోసాలపై నిలదీసేందుకు ప్రజానీకం ఎదురు చూస్తోందన్నారు. తిరుపతి వేదికగా మీ సమక్షంలోనే రాష్ట్రానికి పదేళ్లు ప్రత్యేక హోదా అన్నారని,పదేళ్లు కాదని, పదిహేనేళ్లు కావాలని అడిగారన్నారు. మాటలు కోటలు దాటాయి తప్పిస్తే చేతలకు దిక్కులేదని వైఎస్ షర్మిల విమర్శించారు. రాష్ట్రానికి సంజీవని లాంటి హోదా హామీని అందరు కలిసి ఆటకెక్కించారని అన్నారు.
ప్రత్యేక హోదా...
వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చిన పాపాన పోలేదని, ఢిల్లీని తలదన్నే రాజధాని కట్టలేదని, పారిశ్రామిక కారిడార్లు స్థాపన జరగలేదని, పదేళ్లు దాటినా పోలవరం నుంచి చుక్క నీరు పారలేదని షర్మిల విమర్శించారు. కడప స్టీల్ ఫ్యాక్టరీ కట్టలేదని, విశాఖ ఉక్కును రక్షించలేదని ఏటా రెండు కోట్ల ఉద్యోగాల్లో కనీసం లక్ష ఉద్యోగాలు కూడా రాష్ట్రానికి ఇచ్చింది లేదని తెలిపారు. విశాఖకు వస్తున్న ప్రధాని మోడీని, ముఖ్యమంత్రి చంద్రబాబుని,ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోందన్నారు. విశాఖ వేదికగా ప్రధానితో ప్రత్యేక హోదా ప్రకటన చేయించాలని,విభజన హామీలపై క్లారిటీ ఇప్పించాలని, విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ లేదని మోడీతో పలికించాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు.
Next Story