Mon Dec 23 2024 03:52:10 GMT+0000 (Coordinated Universal Time)
Ys Sharmila : అన్నా.. ఏపీ పరువు తీసి పారేశావుగా.. జగన్ పై ఫైర్
వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరువు తీశారని కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు
వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరువు తీశారని కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ జగన్, అదానీ అవినీతి వ్యవహారం అంటూ ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్కు పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీ 1,750 కోట్ల రూపాయలు లంచం ఇచ్చినట్లు అమెరికా ఏజెన్సీల దర్యాప్తులో స్పష్టంగా వెల్లడైందని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల అన్నారు.
రాష్ట్రం పరువు తీశారంటూ...
ఈ అవినీతి కేసుతో అదానీ దేశం పరువు, జగన్ రాష్ట్రం పరువు తీశారని వైఎస్ షర్మిల ఆక్షేపించారు. హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఇంత పెద్ద స్థాయిలో అవినీతి చేయడంతో పాటు కమీషన్ల పేరుతో కోట్ల రూపాయలను దండుకుంటున్నారని వైఎస్ షర్మిల ఆరోపించారు. అదానీ, జగన్ అవినీతితో ఏపీ పరువు గంగలో కలిసిందని వైఎస్ షర్మిల తెలిపారు.
Next Story