Sun Dec 22 2024 19:01:55 GMT+0000 (Coordinated Universal Time)
Rahul Gandhi : నేడు కడపకు రాహుల్ గాంధీ
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేడు కడప జిల్లాలో పర్యటించనున్నారు. షర్మిలకు మద్దతుగా ప్రచాారం చేయనున్నారు
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేడు కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఎన్నికల ప్రచారం ముగుస్తున్న సమయంలో ఆయన కడప జిల్లా పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. అక్కడ కడప పార్లమెంటు నియోజకవర్గం అభ్యర్థిగా ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల పోటీ చేయనుండటంతో ఈ ఎన్నికల ప్రచారంలో తొలి, చివరి సారిగా రాహుల్ ఏపీలో పర్యటించనున్నారు.
బహిరంగ సభలో...
ఈరోజు ఉదయం 11.30 గంటలకు ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ కడప ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. 11.45 కి ఇడుపులపాయ లోని వైఎస్సార్ ఘాట్ నివాళులు అర్పించనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటలకు కడపలో భారీ బహిరంగ సభలో రాహుల్ గాంధీ పాల్గొంటారు. ఆయనతతో పాటు కాంగ్రెస్ అగ్రనేతలు కేసీ వేణుగోపాల్, మానిక్కం ఠాగూర్, తమిళనాడు ఉప ముఖ్యమంత్రి డీకే శివ కుమార్ సభకు హాజరు కానున్నారు.
Next Story