Sat Nov 23 2024 21:58:23 GMT+0000 (Coordinated Universal Time)
టీటీడీపై టీ.సుబ్బిరామిరెడ్డి ప్రశంసలు
తిరుపతిలో కాంగ్రెస్ పాదయాత్ర నిర్వహించగా.. ఆ పాదయాత్రలో పాల్గొన్నారు కేంద్ర మాజీ మంత్రులు
కేంద్ర మాజీ మంత్రి టీ.సుబ్బిరామిరెడ్డి టీటీడీపై ప్రశంసలు కురిపించారు. టీటీడీ పరిపాల ప్రస్తుతం చాలా బాగుందని.. టీటీడీ చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి, ఈఓ ధర్మారెడ్డి నేతృత్వంలో మంచి సౌకర్యాలు కల్పిస్తున్నారన్నారు. అన్యాయానికి అవకాశం లేకుండా భక్తులకు సేవ చేస్తున్నారని అభినందించారు. ఎంత మంచి పాలన ఉన్నా దానిపై రాళ్లు వేయడం మామూలే అని, రెండుసార్లు టీటీడీ చైర్మన్ గా చేసిన వ్యక్తిగా టీటీడీ పాలనను ప్రశంసిస్తున్నా అని సుబ్బిరామిరెడ్డి అన్నారు.
తిరుపతిలో కాంగ్రెస్ పాదయాత్ర నిర్వహించగా.. ఆ పాదయాత్రలో పాల్గొన్నారు కేంద్ర మాజీ మంత్రులు టి. సుబ్బరామిరెడ్డి, చింతా మోహన్. అంబేద్కర్ భవన్ వద్ద జరిగిన బహిరంగ సభలో సుబ్బిరామిరెడ్డి మాట్లాడుతూ.. టీటీడీ పరిపాలను ప్రస్తుతం చాలా బాగుందని కితాబిచ్చారు. టీటీడీ చైర్మన్ వై.వి. సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డి నేతృత్వంలో మంచి సౌకర్యాలు కల్పిస్తున్నారని అన్నారు. తన జీవితంలో మరపురాని ఘటన టీటీడీ చైర్మన్ అవ్వడం అన్న ఆయన.. టీటీడీ చైర్మన్ పదవి ముందు ఏ పదవైనా తక్కువే అన్నారు. టీటీడీ చైర్మన్ కు దేవుని సేవ చేసుకునే అవకాశం లభిస్తుందన్నారు.
భారతదేశ చరిత్రలో నంబర్ వన్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్నారు సుబ్బిరామిరెడ్డి. దేశంలో అంటరానితనాన్ని నిర్మూలించింది కాంగ్రెస్ పార్టీ. ఇక ఆంధ్రప్రదేశ్ ను ఒక్క కాంగ్రెస్సే విభజించలేదు..అన్ని పార్టీలు ఒప్పుకుంటేనే అధికారంలో ఉన్నాం కాబట్టి రాష్ట్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. బీజేపీ కూడా సపోర్ట్ చేసింది కాబట్టే రాష్ట్రాన్ని విభజించామన్నారు. అన్ని పార్టీలు సపోర్ట్ చేయడం వల్లే రాష్ట్రాన్ని విభజించాము తప్ప కాంగ్రెస్ పార్టీకి ఆ ఆలోచన లేదన్నారు. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏపీలో పాతాళంలోకి వెళ్ళిపోయిన సంగతి తెలిసిందే..!
Next Story