Mon Apr 14 2025 01:34:21 GMT+0000 (Coordinated Universal Time)
మోదీ సర్కార్ పై వైఎస్ షర్మిల ఫైర్
వక్ఫ్ బిల్లుపై కాంగ్రెస్ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు.

వక్ఫ్ బిల్లుపై కాంగ్రెస్ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ముస్లింలకు రాజ్యాంగం ఇచ్చిన మత స్వేచ్ఛను హరించడానికే వక్ఫ్ సవరణ బిల్లును తెచ్చారని షర్మిల అన్నారు. ఇది మైనారిటీలను అణిచివేసే కుట్ర అని ఆమె అభిప్రాయపడ్డారు. రాజ్యాంగ వ్యతిరేక బిల్లుగా అభివర్ణించారు. దేశ వ్యాప్తంగా ముస్లింల మనోభావాలు దెబ్బతీయడమే నియంత మోడీ అజెండా అని వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు.
ముస్లింలు వ్యతిరేకిస్తున్నా...
పార్లమెంట్ ముందుకు సవరణ బిల్లు రావడం అంటే ఈ దేశానికి ఇవ్వాళ బ్లాక్ డే అని వైఎస్ షర్మిల అన్నారు. దేశ చరిత్రలో ఒక మాయని మచ్చగా మిగిలిపోయే ఒక చర్యగా వైఎస్ షర్మిల తెలిపారు. ఈ బిల్లు ద్వారా మత విద్వేషాలు రెచ్చగొట్టడం తప్పా మరొకటి కాదని, వక్ఫ్ ఆస్తులను అన్యాక్రాంతం చేయడం కోసమే ఈ పన్నాగానికి తెరలేపారని, దేవుడికి ఇచ్చిన ఆస్తిని కాజేసి మోడీ బినామీలకు, మోడీ దోస్తులకు వక్ఫ్ ఆస్తులను దారాదత్తం చేసే కుట్ర జరుగుతోందనితెలిపారు. వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ దేశంలో 20 కోట్ల మంది ముస్లింలు ఆందోళనలు చేస్తున్నా వారి వేదన వినకుండా బిల్లును చట్టసభల్లో ప్రవేశపెట్టడం ప్రజాస్వామ్య విద్రోహ చర్య అని వైఎస్ షర్మిల అన్నారు.
Next Story