Sun Dec 22 2024 09:30:09 GMT+0000 (Coordinated Universal Time)
Ys Sharmila : నేడు వైఎస్ షర్మిల నామినేషన్
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారు
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారు. వైఎస్ షర్మిల కడప పార్లమెంటు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న సంగతి తెలసిిందే. ఇప్పటికే వైఎస్ జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్న షర్మిల నేడు కడప జిల్లాలో గెలుపు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఆమె తనను వైఎస్సార్ బిడ్డగా ఆదరించాలని కోరుతూ కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగుతుండటంతో పోటీ ఆసక్తికరంగా మారింది.
కడప ఎంపీగా...
ఈరోజు వైఎస్ షర్మిల ఉదయం ఎనిమిది గంటలకు ఇడుపులపాయ వద్ద వైఎస్సార్ ఘాట్ లో నివాళులర్పించి నామినేషన్ పత్రాలను ఉంచి నివాళులర్పించనున్నారు. అనంతరం షర్మిల కడపలోని ఐటీఐ సర్కిల్ నుంచి భారీ ర్యాలీగా బయలుదేరి ఉదయం పదకొండు గంటలకు నామినేషన్ దాఖలు చేయనున్నారు. అనంతరం జరిగే బహిరంగ సభలో ఆమె ప్రసంగిస్తారు.
Next Story