Fri Nov 22 2024 23:02:56 GMT+0000 (Coordinated Universal Time)
టిటిడికి షాకిచ్చిన కోర్టు.. ఆ భక్తుడికి రూ.50లక్షలు చెల్లించాలని ఆదేశం
తమిళనాడులోని సేలంకు చెందిన హరిభాస్కర్ అనే భక్తుడు 2006లో మేల్ చాట్ వస్త్రం సేవ నిమిత్తం టిటిడి..
తిరుమల తిరుపతి దేవస్థానానికి వినియోగదారుల కోర్టు షాకిచ్చింది. మేల్ చాట్ వస్త్ర సేవ కోసం బుక్ చేసుకున్న భక్తుడికి.. ఆ సేవను కలిగించకపోవడాన్ని తప్పుపడుతూ.. సదరు భక్తుడికి రూ.50 లక్షలు చెల్లించాలని ఆదేశించింది. వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడులోని సేలంకు చెందిన హరిభాస్కర్ అనే భక్తుడు 2006లో మేల్ చాట్ వస్త్రం సేవ నిమిత్తం టిటిడి కి రూ.12,250 చెల్లించారు. 16 సంవత్సరాలవుతున్నా ఇంతవరకూ ఆ భక్తుడికి సేవలో పాల్గొనే అవకాశం కల్పించలేదు టిటిడి. దీనిపై ఆయన పలుమార్లు టిటిడికి ఫిర్యాదు చేసినా స్పందన లేదు.
ఆఖరికి కరోనా సమయంలో మేల్ చాట్ వస్త్రం సేవకు బదులుగా వీఐపీ టికెట్ ఇస్తామని టిటిడి ఆఫర్ చేసింది. కానీ అందుకు హరి భాస్కర్ అంగీకరించలేదు. మేల్ చాట్ వస్త్ర సేవే కావాలని డిమాండ్ చేశాడు. కానీ టిటిడి అతడి విన్నపాన్ని పెడచెవిన పెట్టడంతో.. హరిభాస్కర్ సేలంలోని వినియోగదారుల కోర్టును ఆశ్రయించారు. దానిపై విచారణ జరిపిన కోర్టు.. భాస్కర్ కు ఏడాదిలోపు మేల్ చాట్ వస్త్రం సేవను కల్పించాలని, లేని పక్షంలో అతనికి రూ.50 లక్షలు చెల్లించాలని ఆదేశించింది.
Next Story