Tue Nov 05 2024 23:12:07 GMT+0000 (Coordinated Universal Time)
కొనసాగుతున్న రద్దీ.. దర్శనానికి ఎన్నిగంటలు ?
సోమవారం (మే29) తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు 23 కంపార్టుమెంట్లలో భక్తులు వేచిచూస్తున్నారని..
తిరుమల ఏడుకొండలపై కొలువై ఉన్న స్వామివారి దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు వస్తుండటంతో.. కొద్దిరోజులుగా తిరుమల క్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సోమవారం (మే29) తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు 23 కంపార్టుమెంట్లలో భక్తులు వేచిచూస్తున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వెల్లడించింది. స్వామివారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతుందని తెలిపింది.
నిన్న (మే28) స్వామివారిని 78,818 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే 39,076 మంది భక్తులు తలనీలాల మొక్కులు చెల్లించుకున్నట్లు టీటీడీ పేర్కొంది. ఆదివారం భక్తులు సమర్పించిన కానుకల ద్వారా స్వామివారి ఆదాయం రూ.3.66 కోట్లు వచ్చినట్లు తెలిపింది. కాగా.. అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో తిరుమలకు వచ్చే భక్తులకు త్రాగునీరు, అన్నప్రసాద వితరణలో ఎలాంటి సమస్యలు రాకుండా టీటీడీ చర్యలు చేపట్టింది. భక్తుల సౌకర్యార్థం తగు ఏర్పాట్లు చేసింది.
Next Story