Sun Dec 22 2024 13:02:05 GMT+0000 (Coordinated Universal Time)
బాలినేనిపై వ్యతిరేకంగా ఒంగోలులో ఫ్లెక్సీలు
ఒంగోలులో మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన ప్లెక్సీలతో కలకలం రేగింది
ఒంగోలులో మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన ప్లెక్సీలతో కలకలం రేగింది. ఒంగోలు పట్టణంలో బాలినేనిపై సుబ్బారవు గుప్తా ఫ్లెక్సీలతో యుద్ధానికి దిగారు. నగరంలో పదిచోట్ల వెలసిన ప్లెక్సీలను ఏర్పాటు చేశారు. తనను బెదిరించి అదిరించి అధికార మదంతో అణిచివేయాలని చూశాని, ఇప్పుడు నీకు దమ్ముందా..? రా చూసుకుందామంటూ ప్లెక్సీల ద్వరా బాలినేనికి సుబ్బారావు గుప్తా సవాలు విసిరారు. ఉండి ఎమ్మెల్యే రాఘురామ కృష్ణం రాజు పేరుతో థ్రిబుల్ ఆర్ లెనిన్ హైస్ క్లాత్ షోరూం ఓపెన్ చేసిన గుప్తా ఫ్లెక్సీలతో బాలినేనిపై వార్ ప్రకటించారు.
అక్రమాలను బట్టబయలు చేస్తానంటూ...
త్రిబుల్ ఆర్ కోరిక మేరకే తాను RRR లెనిన్ క్లాత్ షోరూమును ఓపెన్ చేశానని గుప్తా వెల్లడించారు. గతంలో తాను బతుకుదామని బట్టలషాపు పెడితే తనను బాలినేని బెదిరించాడని...ప్రజానాయకుడు అంటే బెదిరిపోవడంకాదని పోరాడే వాడే నాయకుడంటూ ఫ్లెక్సీల్లో గుప్తా పేర్కొన్నాడు.ఎక్కడైతే తాను అవమాన పాలయ్యానో కక్షగట్టి తన షాపును మూయించారో అదే చోట ఇప్పుడు దమ్మువిరిచి నిలబడ్డానన్నాడు. రెండు మూడురోజుల్లో బాలినేని వ్యక్తిగత అక్రమాలను సాక్షాదారాలు మ్యాపింగ్ లతో సహా సంచలనమైన విషయాలను బయటపెడతానని హెచ్చరించారు.
Next Story