Sun Dec 22 2024 23:59:35 GMT+0000 (Coordinated Universal Time)
గుంటూరులో కరోనా
కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది.
కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. తాజాగా ఏపీలోని గుంటూరు జిల్లాలో ఇద్దరికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. వారిద్దరికీ ప్రత్యేక వార్డులో చికిత్స అందిస్తున్నట్లు జిల్లా వైద్యాశాఖాధికారి శ్రావణ్ బాబు తెలిపారు. వీరిద్దరూ తాడేపల్లికి చెందిన వారు.
దేశ వ్యాప్తంగా....
దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అప్రమత్తం చేసింది. కోవిడ్ నిబంధనలను పాటించేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, తెలంగాణ, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో కరోనా కేసులు ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు కూడా మాస్క్లు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి నిబంధనలను పాటించాలని వైద్య శాఖ అధికారులు సూచిస్తున్నారు.
Next Story