Mon Dec 23 2024 17:26:59 GMT+0000 (Coordinated Universal Time)
రేణూదేశాయ్, అకీరాకు కరోనా
నటి రేణూ దేశాయ్ ఇంట్లో కరోనా కలకలం రేగింది. రేణూదేశాయ్ తో పాటు ఆమె కుమారుడు అకీరా నందన్ కు కూడా కరోనా సోకింది.
నటి రేణూ దేశాయ్ ఇంట్లో కరోనా కలకలం రేగింది. రేణూదేశాయ్ తో పాటు ఆమె కుమారుడు అకీరా నందన్ కు కూడా కరోనా సోకింది. ఈ విషయాన్ని రేణూ దేశాయ్ స్వయంగా ట్విట్టర్ లో వెల్లడించారు. స్వల్ప లక్షణాలు ఉండటంతో పరీక్షలు చేయించుకోగా రేణూదేశాయ్ తో పాటు తనయుడు అకీరాకు కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.
ఇంట్లోనే ఉన్నా....
అయితే ఎక్కువగా ఇంట్లోనే ఉన్నా తమకు కోవిడ్ పాజిటివ్ గా తేలిందని రేణూ దేశాయ్ తెలిపారు. హోం ఐసొలేషన్ లో ఉండి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నామని తెలిపారు. కోవిడ్ ను సీరియస్ గా ప్రతి ఒక్కరూ తీసుకోవాలని, మాస్క్ లు ధరించి, భౌతిక దూరాన్ని పాటించాలని రేణూదేశాయ్ కోరారు.
Next Story