Mon Dec 23 2024 12:00:56 GMT+0000 (Coordinated Universal Time)
కావలిలో ఒమిక్రాన్ టెన్షన్ .. కుటుంబంలో నలుగురికి పాజిటివ్ ?
కరోనా కొత్త వేరియంట్ అయిన ఒమిక్రాన్ ఏపీని కలవరపెడుతోంది. నెల్లూరు జిల్లా కావలిలో ఒమిక్రాన్ టెన్షన్ మొదలైంది.
కరోనా కొత్త వేరియంట్ అయిన ఒమిక్రాన్ ఏపీని కలవరపెడుతోంది. నెల్లూరు జిల్లా కావలిలో ఒమిక్రాన్ టెన్షన్ మొదలైంది. ఇటీవలే అమెరికా నుంచి కావలి వచ్చిన నలుగురు కుటుంబ సభ్యులకు కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయింది. బాధితుల్లో ఇద్దరు వైద్యులు కావడం గమనార్హం. విదేశాల నుంచి రావడంతో వారికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. పాజిటివ్ గా తేలింది. దాంతో ఆ ఇద్దరు వైద్యులు పనిచేస్తున్న ఆస్పత్రిలో రోగులకు కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు.
నిర్ధారణ పరీక్షలకు...
కాగా.. ఆ నలుగురికి ఒమిక్రాన్ సోకిందేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వారి నుంచి సేకరించిన శాంపిళ్లను ఒమిక్రాన్ నిర్థారణ పరీక్షలకు పంపించారు. ఇక తాజాగా భారత్ లో మరో మూడు ఒమిక్రాన్ కేసులు నమోదవ్వగా.. దేశంలో ఈ వేరియంట్ కేసుల సంఖ్య 26కు చేరింది. గుజరాత్ లోని జామ్ నగర్ లో రెండు ఒమిక్రాన్ కేసులు నమోదవ్వగా.. మహారాష్ట్రలో మరో ఒమిక్రాన్ కేసు నమోదైంది.
Next Story