Mon Dec 23 2024 16:37:04 GMT+0000 (Coordinated Universal Time)
రెండురోజుల్లో చనిపోతా.. వైసీపీ నేతల వేధింపులే
వైసీపీ నాయకుల వేధింపులు తట్టుకోలేకపోతున్నానని, రెండో రోజుల్లో చనిపోతున్నానని కార్పొరేటర్ భర్త పెదబాబు ఒక వీడియో పెట్టారు
విజయవాడ : వైసీపీ నాయకుల వేధింపులు తట్టుకోలేకపోతున్నానని, రెండో రోజుల్లో చనిపోతున్నానని కార్పొరేటర్ భర్త పెదబాబు ఒక సెల్ఫీ వీడియో విడుదల చేశారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. విజయవాడ 48వ డివిజన్ కార్పొరేటర్ భర్త అత్తలూరి పెదబాబు తనను వైసీపీ నేతలు వేధిస్తున్నారన్నారు. తన కేబుల్ వ్యాపారాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. తన వ్యాపారాన్ని వైసీపీలోని కొందరు నేతలు నాశనం చేయాలని చూస్తున్నారని చెప్పారు.
కొందరు కక్ష గట్టి.....
కొందరు తెలుగుదేశం నుంచి వచ్చిన వారు వైసీపీ సీనియర్ నేతలను తప్పుదోవ పట్టిస్తున్నారని పెదబాబు అన్నారు. ఎంఎస్ఓలతో చేతులు కలిపి తన కేబుల్ వ్యాపారాన్ని దెబ్బతీస్తున్నారన్నారు. వారి వత్తిడులకు తట్టుకోలేకపోతున్నానని చెప్పారు. తాను వైసీపీ గెలుపుకు ఎంతో పనిచేశానని, తన భార్యను కూడా కార్పొరేటర్ గా గెలిపించుకోవడంతో కొందరు వైసీపీ నేతలే తనపై కక్ష కట్టారని పెదబాబు తెలిపారు. ఈ వేధింపులు ఆపకపోతే రెండు రోజుల్లో చనిపోతానని, తన చావుకు వైసీపీ నేతలే బాధ్యులని ఆ వీడియోలో పెదబాబు పేర్కొన్నారు.
Next Story