Mon Dec 23 2024 11:34:47 GMT+0000 (Coordinated Universal Time)
ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ బోణీ
ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభయింది.శ్రీకాకుళం ఎమ్మెల్సీ స్థానంలో వైసీపీ అభ్యర్థి నర్తు రామారావు గెలుపొందారు.
ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభయింది. అయితే శ్రీకాకుళం ఎమ్మెల్సీ స్థానంలో వైసీీపీ అభ్యర్థి నర్తు రామారావు గెలుపొందారు. ఈ మేరకు అధికారులు ప్రకటించారు. నర్తు రామారావు తన సమీప ప్రత్యర్థిపై 632 ఓట్ల తేడాతో గెలుపొందినట్లు అధికారులు వెల్లడించారు. స్థానిక సంస్థల కోటాలో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా నుంచి నర్తు రామారావు ఎంపికయ్యారు.
స్థానిక సంస్థల కోటా...
సామాజిక సమీకరణాలను, పార్టీ విధేయతను దృష్టిలో ఉంచుకుని వైసీపీ అధినేత జగన్ స్థానిక సంస్థల ఎన్నికల కోటా కింద నర్తు రామారావును ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపిక చేశారు. యాదవ సామాజికవర్గానికి చెందిన రామారావు 1990 నుంచి రాజకీయాల్లో ఉన్నారు. ధర్మాన సోదరులకు అత్యంత సన్నిహితుడైన రామారావు గెలుపు సాధించడం పట్ల వైసీపీ శ్రేణులు ఆనందోత్సాహలు కనపరుస్తున్నాయి.
Next Story