Thu Dec 19 2024 02:55:46 GMT+0000 (Coordinated Universal Time)
పిన్నెల్లికి బెయిల్ నిరాకరణ
మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బెయిల్ పిటీషన్ ను కోర్టు కొట్టివేసిింది
మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బెయిల్ పిటీషన్ ను కోర్టు కొట్టివేసిింది. ఆయనకు బెయిల్ ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది. తనకు బెయిల్ ఇవ్వాలంటూ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటీషన్ పై విచారించిన న్యాయస్థానం బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. ఎన్నికల సమయంలో తలెత్తిన హింసాత్మక ఘటనలపై ఆయన పై కేసు నమోదు కావడంతో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.
నెల్లూరు జైలులో...
ఆయన గత కొద్ది రోజులుగా నెల్లూరు జైలులో ఉన్నారు. అయితే బెయిల్ కు దరఖాస్తు చేసుకుంటే దానిని న్యాయస్థానం నిరాకరించడంతో పిన్నెల్లికి ఆశాభంగం ఎదురయింది. ఎన్నికల సందర్భంగా టీడీపీ కార్యకర్త, విధి నిర్వహణలో ఉన్న పోలీసు అధికారిపై చేయి చేసుకున్నారన్న ఆరోపణలతో ఆయనను అరెస్ట్ చేశారు.
Next Story