Mon Dec 23 2024 05:12:04 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : వైసీపీ నేత తోట త్రిమూర్తులకు జైలు శిక్ష
శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులకు న్యాయస్థానం శిక్ష విధించింది
శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులకు న్యాయస్థానం శిక్ష విధించింది. విశాఖ న్యాయస్థానం ఈ మేరకు తీర్పు చెప్పింది. తోట త్రిమూర్తులతో పాటు మరో ఆరుగురికి ఈ కేసులో పద్దెనిమిది నెలల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. త్రిమూర్తులకు జైలు శిక్షతో పాటు 2.50 లక్షల జరిమానాను కూడా విధించింది. తోట త్రిమూర్తులు ప్రస్తుతం మండపేట నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ తరుణంలో విశాఖ న్యాయస్థానం ఇచ్చిన తీర్పు ఆయనకు ఇబ్బంది కలిగించేలా ఉంది.
28 ఏళ్ల క్రితం...
1996 డిసెంబరు 29న కోనసీమ జిల్లాలోని రామచంద్రాపురం మండలం వెంకటాయపాలెంలో ఐదుగురు దళితులను హింసించడంతో పాటు ఇద్దరికి శిరోముండనం చేశారన్న దానిపై కేసు నమోదయింది. దాదాపు ఇరవై ఎనిమిదేళ్ల పాటు కేసు నడిచింది. ఇటీవల విచారణ పూర్తి కావడంతో తీర్పు రిజర్వ్ చేసింది. నేడు న్యాయస్థానం ప్రకటించింది. అప్పట్లో ఈ వ్యవహారం ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించింది.
Next Story