Sat Nov 23 2024 01:34:07 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీలో కొనసాగుతోన్న కరోనా ఉద్ధృతి.. మళ్లీ 800కి పైగా కేసులు !
రాష్ట్ర వైద్యరోగ్య శాఖ వెల్లడించిన వివరాల మేరకు గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 37,553 మంది శాంపిల్స్ ను
ఏపీలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. నిన్న విడుదల చేసిన కోవిడ్ బులెటిన్ లో 840 కేసులు నమోదవ్వగా.. తాజాగా రాష్ట్ర వైద్యారోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ లో 839 కొత్తకేసులు బయటపడ్డాయి. రాష్ట్ర వైద్యరోగ్య శాఖ వెల్లడించిన వివరాల మేరకు గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 37,553 మంది శాంపిల్స్ ను పరీక్షించగా.. వారిలో 839 మందికి కరోనా నిర్థారణ అయింది. వీటిలో అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 175, విశాఖలో 174 కేసులు నమోదయ్యాయి. మిగతా జిల్లాలోనూ పదుల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి.
ఇక ఇదే సమయంలో 150 మంది కోవిడ్ నుంచి కోలుకోగా.. ఇద్దరు మరణించారు. దీంతో రాష్ట్రంలో కోవిడ్ మరణాల సంఖ్య 14,503కి పెరిగింది. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 20,80,602 పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. 20,62,440 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం ఏపీలో 3,659 యాక్టివ్ కేసులు ఉండగా.. వారంతా వివిధ ఆస్పత్రుల్లో, హోం ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్నారు.
Next Story