Mon Dec 15 2025 06:40:13 GMT+0000 (Coordinated Universal Time)
బాలికల గురుకులంలో కరోనా కలకలం.. ఎనిమిది మందికి పాజిటివ్ !
అనంతపురం జిల్లాలోని బాలికల గురుకులంలో కరోనా కలకలం రేగింది. ఉరవకొండ బాలయోగి సాంఘిక సంక్షేమ బాలికల గురుకులంలో 25 మందికి

ప్రతినిత్యం కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. చిన్నా, పెద్దా తేడా లేదు. ఎవ్వరినీ వదలడం లేదు మాయదారి మహమ్మారి. తాజాగా అనంతపురం జిల్లాలోని బాలికల గురుకులంలో కరోనా కలకలం రేగింది. ఉరవకొండ బాలయోగి సాంఘిక సంక్షేమ బాలికల గురుకులంలో 25 మందికి కోవిడ్ నిర్థారణ పరీక్షలు చేయగా.. 8 మందికి నిర్థారణ అయింది. పాఠశాలలోని ఐదుగురు ఉపాధ్యాయులు, ముగ్గురు విద్యార్థులకు కరోనా సోకింది. పాఠశాలలో కరోనా కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. బాలయోగి సాంఘిక సంక్షేమ బాలికల గురుకులంలో వైద్యులు గురుకులానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
Next Story

