Sat Jan 11 2025 00:40:34 GMT+0000 (Coordinated Universal Time)
ఇంతకీ ఎవరు ఎవర్ని పిలిచారు?
ముఖ్యమంత్రి జగన్, మెగాస్టార్ చిరంజీవి భేటీని సీపీఐ జాతీయ నేత నారాయణ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు
ముఖ్యమంత్రి జగన్, మెగాస్టార్ చిరంజీవి భేటీని సీపీఐ జాతీయ నేత నారాయణ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. యూనియన్ నేతలను వదిలేసి చిరంజీవితో ఎందుకు భేటీ అయ్యారని నారాయణ ప్రశ్నించారు. చిరంజీవి మాత్రం తాను ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి కబురు వస్తేనే వెళ్లానని చెబుతున్నారని, కానీ వైసీపీ నేతలు మాత్రం చిరంజీవి తనంతట తానుగానే వచ్చారని అంటున్నారని నారాయణ అన్నారు.
ఏది నిజం?
వీటిలో ఏది నిజం అన్న విషయాన్ని బయటకు చెప్పాలన్నారు. వాస్తవానికి వాళ్లిద్దరి మధ్య జరిగిన చర్చల సారాంశాన్ని బయటపెట్టాలని నారాయణ డిమాండ్ చేశారు. రాజకీయాలు తమ వద్ద ప్రస్తావనకు రాలేదని, కేవలం సినిమా సమస్యలపైనే చర్చించామని చిరంజీవి చెప్పారు. కానీ నారాయణ మాత్రం దీనిపై అభ్యంతరం తెలిపారు.
Next Story