Sun Dec 22 2024 22:23:08 GMT+0000 (Coordinated Universal Time)
కలిసే పోటీ చేస్తాం : నారాయణ
వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేనతో కలిసే పోటీచేస్తామని సీీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తెలిపారు
వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేనతో కలిసే పోటీచేస్తామని సీీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తెలిపారు. రాబోయే ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలతో కలిసి సీపీఐ ఎన్నికల బరిలో నిలవబోతుందని తెలిపారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన, సీపీఐ కలిసే పోటీ చేస్తాయంటూ నారాయణ చేసిన కామెంట్స్ రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. కలవడం అంటూ జరిగితే మా ఓట్లు ఇవ్వడం మాత్రమే కాదు.. మాకు సీట్లు కూడా కావాలని స్పష్టం చేశారు సీపీఐ నారాయణ. జగన్ మోదీ వద్దకు వెళ్లి మోకరిల్లుతున్నాడని విమర్శ్శించారు.
జగన్ లో అది కనిపించడం లేదు...
పోలవరం విషయంలో వైఎస్ లో ఉన్న పోరాట స్ఫూర్తి జగన్ లో కనిపించడం లేదని సీపీఐ నారాయణ అన్నారు. వాళ్ల నాన్న సిద్ధాంతాలకు కూడా పంగ నామాలు పెట్టిన వ్యక్తి గా జగన్ మిగిలిపోయేలా ఉన్నారంటూ ఎద్దేవా చేశారు.. రాష్ట్ర ప్రయోజనాల కోసం సలహాలు ఇచ్చినా తీసుకునే తత్వం సీఎం వైఎస్ జగన్ కు లేదని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి వీడాలని, విభజన హామీలు నెరవేరేందుకు కేంద్ర ప్రభుత్వంప జగన్ పోరాడాలని కోరారు.
Next Story