Mon Dec 23 2024 04:03:56 GMT+0000 (Coordinated Universal Time)
జగన్ కు రామకృష్ణ హెచ్చరిక
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ రాశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ రాశారు. 14,15 ఆర్థిక సంఘాల నిధులను రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం సరికాదని సూచించారు. పంచాయతీ నిధులను ప్రభుత్వం తీసుకోవడమేంటని రామకృష్ణ ప్రశ్నించారు. సర్పంచ్ లకు విధులు, నిధులు ఇవ్వకుండా గ్రామ ాల అభివృద్ధి ఎలా సాధ్యమవుతుందని లేఖలో జగన్ ను రామకృష్ణ నిలదీశారు.
అధికార వికేంద్రీకరణ....
అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం అధికార వికేంద్రీకరణ జరగాలని చెబుతున్న మీరు ఉన్న నిధులు, విధులను లాక్కోవడం దేనిని సూచిస్తుందన్నారు. ఇప్పటికే సర్పంచ్ లు నిధులు లేక రోడ్లు ఎక్కుతున్నారని, వెంటనే పంచాయతీలకు నిధులు విడుదల చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేసేందుకు సిద్దమని రామకృష్ణ హెచ్చరించారు.
- Tags
- ramakrshna
- cpi
Next Story