Fri Nov 22 2024 22:29:21 GMT+0000 (Coordinated Universal Time)
అమరావతి రైతులకు ప్లాట్ల రిజిస్ట్రేషన్
రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు బదులుగా ప్లాట్లను ఇచ్చేలా గత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాని ప్రకారం భూములిచ్చిన రైతులకు
అమరావతి : అమరావతి రైతుల ప్లాట్ల రిజిస్ట్రేషన్ పునః ప్రారంభమయింది. హైకోర్టు తీర్పు మేరకు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సంబంధించిన ప్లాట్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియను తిరిగి ప్రారంభించింది. రాజధాని కోసం 28వేల587 మంది అమరావతి రైతులు 34,385 ఎకరాల భూమిని అప్పటి టిడిపి ప్రభుత్వానికి ఇచ్చారు. ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం రావడం, మూడు రాజధానుల ప్రకటనతో రైతులు ఉద్యమం చేపట్టారు. ఇటీవల ఏపీ రాజధాని అమరావతేనని హైకోర్టు తీర్పు వెలువరించింది.
కాగా రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు బదులుగా ప్లాట్లను ఇచ్చేలా గత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాని ప్రకారం భూములిచ్చిన రైతులకు 38,282 నివాస, 26,453 వాణిజ్య ప్లాట్లను ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంది. ఈ మేరకు 40,378 ప్లాట్లను గత ప్రభుత్వం రైతుల పేరున రిజిస్ట్రేషన్ చేసింది. జగన్ సర్కార్ అధికారంలోకి రాగానే ఆ రిజిస్ట్రేషన్లు ఆపివేయడంతో రైతులు, అమరావతి వాసులు హైకోర్టును ఆశ్రయించారు. వారి పిటిషన్ పై విచారణ చేసిన హైకోర్టు.. రిజిస్ట్రేషన్లను పునః ప్రారంభించాలని ఆదేశించింది. హైకోర్టు ఆదేశాల మేరకు సీఆర్డీఏ రిజిస్ట్రేషన్ల ప్రక్రియను ప్రారంభించింది. మిగతా 24,357 ప్లాట్ల రిజిస్ట్రేషన్లను షురూ చేసింది.
Next Story