Mon Dec 23 2024 09:22:36 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : జగన్‌ను కలిసిన అంబటి రాయుడు
ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు ముఖ్యమంత్రి జగన్ ను కలిసేందుకు తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి వచ్చారు
ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు ముఖ్యమంత్రి జగన్ ను కలిసేందుకు తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి వచ్చారు. ముఖ్యమంత్రి జగన్‌తో ప్రత్యేకంగా సమావేశమవుతున్నారు. అయితే అంబటి రాయుడు జగన్ ను కలవడానికి ఎందుకొచ్చారన్న దానిపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఏపీలో ఏదైనా క్రికెట్ అకాడమీ పెట్టేందుకు అంబటి రాయుడు జగన్ వద్దకు వచ్చారా? లేక రాజకీయంగా నిర్ణయం తీసుకుని వచ్చారా? అన్నది తెలియాల్సి ఉంది.
క్రికెట్ అకాడమీ కోసమేనా?
గత కొన్నాళ్లుగా అంబటి రాయుడు జగన్ ను ప్రశంసిస్తూ ట్వీట్లు చేస్తున్నారు. వచ్చే ఎన్నికలలో వైసీపీ తరుపున పోటీ చేస్తారని కూడా గత కొంతకాలం నుంచి ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం అంబటి రాయుడు జగన్ ను కలవడంతో ఏపీ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్ గా మారింది. ఏపీకి చెందిన అంబటి రాయుడు అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లకు గుడ్ బై చెప్పారు. ప్రస్తుతం ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో ఉన్నారు. గుంటూరు జిల్లాకు చెందిన అంబటి రాయుడు కాపు సామాజికవర్గానికి చెందిన యువకుడు కావడంతో చర్చ అన్ని రకాలుగా సాగుతుంది.
Next Story