Tirumala : 31 కంపార్ట్మెంట్లలో భక్తులు.. దర్శనానికి ఎంత సమయం అంటే?
తిరుమలలో రద్దీ కొనసాగుతుంది. గురువారం కూడా భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంది.
తిరుమలలో రద్దీ కొనసాగుతుంది. గురువారం కూడా భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంది. తిరుమలలో భక్తులు ఇటీవల కాలంలో ఎక్కువ సంఖ్యలో వచ్చి శ్రీవారిని దర్శించుకుంటున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా వారాలతో సంబంధం లేకుండా తిరుమల భక్తులతో కిటకిటలాడిపోతుంది. దర్శనం కూడా ఆలస్యంగా మారుతుంది. క్యూ లైన్లలోనే గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. ఇటీవల వరకూ సోమ, మంగళ, బుధ, గురు వారాల్లో భక్తుల రద్దీ అంతంత మాత్రంగానే ఉండేది. కేవలం శుక్ర, శని, ఆదివారాలు మాత్రమే భక్తులు అధిక సంఖ్యలో వచ్చే వారు. కానీ ఇప్పుడు వారాలతో సంబంధం లేకుండా ముందుగానే టిక్కెట్లు బుక్ చేసుకుని వస్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చి తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం ఇప్పుడు ఎక్కువ కావడంతో తిరుమల తిరుపతి దేవస్థానం కూడా అందుకు తగిన ఏర్పాట్లు చేస్తోంది. లడ్డూల తయారీ సంఖ్య ను కూడా పెంచింది. అన్నదానానికి కూడా అధిక సంఖ్యలో భక్తులు హాజరవుతున్నారని అధికారులు తెలిపారు.