Tirumala : నేడు తిరుమలలో స్వామి వారిని నేరుగా దర్శనం. వేచి ఉండకుండానే?
తిరుమలలో భక్తుల రద్దీ పూర్తిగా తగ్గింది. సోమవారం కావడంతో పాటు వాతావరణ శాఖ హెచ్చరికతో భక్తుల సంఖ్య తక్కువగా ఉంది
తిరుమలలో భక్తుల రద్దీ పూర్తిగా తగ్గింది. సోమవారం కావడంతో పాటు వాతావరణ శాఖ హెచ్చరికతో భక్తుల సంఖ్య తక్కువగా ఉంది. ఇతర ప్రాంతాల నుంచి తిరుమలకు వచ్చే ప్రజలు తమ ప్రయాణాలను రద్దు చేసుకున్నారు. దీంతో తిరుమలలో భక్తుల రద్దీ పూర్తిగా తగ్గింది. గత కొద్ది రోజుల నుంచి తిరుమలలో భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంది. క్యూ లైన్లు కూడా బయట వరకూ వేచి ఉండి 24 గంటల పాటు స్వామి వారి దర్శనం కోసం వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా తిరుమల తిరుపతి దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ వసతి గృహాల విషయంలో ఎవరూ ఏమీ చేయలేని పరిస్థితి కనిపించింది. కాగా నేడు స్వామి వారిని నేరుగా క్యూ లైన్ లో వేచి ఉండకుండానే దర్శించుకునేందుకు వీలుండటంతో భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లు వరస సెలవులు కూడా రావడంతో భక్తుల సంఖ్య అధికంగా ఉందని, తిరిగి దసరా సెలవులు ప్రారంభమయ్యే సమయానికి రద్దీ పెరుగుతుందని అధికారులు అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.